Skip to main content

మరో ట్విస్ట్.. అజిత్ పవార్ కు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని ఆఫర్ చేసిన శివసేన?



మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతివ్వడంతో... ఫడ్నవిస్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ పరిణామంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు షాక్ కు గురయ్యాయి. మరోవైపు, ఎలాగైనా అధికారాన్ని చేపట్టేందుకు శివసేన కూడా శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో అజిత్ పవార్ ను ఆకర్షించేందుకు శివసేన యత్నిస్తోంది. తమకు మద్దతు పలికితే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని అజిత్ పవార్ కు శివసేన ఆఫర్ చేసినట్టు ముంబై పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటికే బీజేపీతో చేయి కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది

Comments