Skip to main content

ఫడ్నవీస్ బలపరీక్షపై తీర్పును రేపటికి రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు.. వేడెక్కిన 'మహా' రాజకీయం



మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షపై ఈరోజు సుప్రీంకోర్టు వాదనలు విన్నది. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు... తీర్పును రిజర్వ్ లో ఉంచింది. రేపు ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరిస్తామని ప్రకటించింది.  

రాజ్ భవన్ మెజార్టీని నిర్ణయించలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం అసెంబ్లీ మాత్రమే మెజార్టీని నిరూపిస్తుందని... శాసనసభలోనే బలపరీక్ష జరగాలని తెలిపింది. ఫడ్నవీస్ ప్రభుత్వానికి అవసరమైనంత సంఖ్యాబలం ఉందా? అని ప్రశ్నించింది. ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.  

Comments