Skip to main content

సమ్మెపై మరోసారి వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ




ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై జేఏసీ  మరోసారి వెనక్కి తగ్గింది. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీజేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు, ఆర్టీసీని బతికించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 52 రోజులపాటు కొనసాగిన పోరాటంలో ఎవరమూ ఓడిపోలేదన్నారు. తాము చేపట్టిన ఈ పోరాటం ఆర్టీసీని బతికించుకోవడానికి, కార్మికుల డిమాండ్లను నేరవేర్చుకోడానికి నాంది పలుకుతుందన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావద్దని ఆయన కోరారు. రేపు ఉదయం 6 గంటలకు కార్మికులందరూ విధులకు హాజరై యాజమన్యంపై ఒత్తిడి తేవాలని పిలుపు నిచ్చారు.  విధుల్లోకి చేరే కార్మికులను ఎవరూ అడ్డుకోవద్దని ఆయన సూచించారు. సెకండ్ షిఫ్ట్ ఉద్యోగులు కూడా విధుల్లో చేరాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తోందని ఆశించిన జేేఏసీ అటువంటి ప్రకటన రాకపోవడంతో.. విధుల్లో చేరాలని నిర్ణయించామని చెప్పారు. హైకోర్టు చేసిన సూచన ప్రకారం, ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల శ్రేయస్సుకోసమే సమ్మె విరమణ చేస్తున్నట్లు తెలిపారు.  

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.