అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూశాక ఏమైంది?' అంటూ నిన్న సోలో బతుకే సో బెటరు సినిమాలోంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా హీరో సాయితేజ్ ఈ రోజు ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. 'అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట... ఈ పాట...' అంటూ సాయితేజ్ కామెంట్ చేశాడు.
'హేయ్ నేనేనా' అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి 'నో పెళ్లి' సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.
Comments
Post a Comment