Skip to main content

జియో బంపర్ ఆఫర్..ఏడాదిపాటు ఉచితంగా


యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరంభమవుతుంది. రూ.499 క్రికెట్‌ ప్లాన్‌ కింద జియో తన వినియోగదారులకు రోజువారీ 1.5 జీబీ హైస్పీడ్‌ డేటాను 56 రోజులు అందిస్తుంది. ఇది క్రికెట్‌ సీజన్‌ అయిపోయే వరకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌తో  వినియోగదారులకు ఎటువంటి కాలింగ్ లేదా ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు రావు.   మరో కొత్త ప్లాన్ రూ.399తో    డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాది పాటు లభించనుంది. 

 రూ. 777   జియో క్రికెట్ ప్లాన్ కింద, 5GB అదనపు డేటాతో 1.5GB రోజువారీ హై-స్పీడ్ డేటాను కంపెనీ  తన వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత జియో నుండి జియో కాలింగ్ ప్రయోజనాలు, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 3,000  ఎఫ్‌యుపి నిమిషాలు, రోజుకు 100 కాంప్లిమెంటరీ ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు అందిస్తోంది.  ఈ ప్లాన్ 84 రోజుల  చెల్లుబాటుతో వస్తుంది. రూ .499 ప్లాన్ మాదిరిగానే, ఇది కూడా ఒక సంవత్సరానికి డిస్నీ + హాట్‌స్టార్ వీఐసీ  సబ్‌స్క్రిప్షన్‌తో వస్తోంది.

Comments