మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని కోరుతూ కేసులు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఈ కేసు ఈరోజు విచారణకు వచ్చింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎం ఆర్ షా ధర్మాసనం ముందుకు వచ్చిన కేసును విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యంతర ఉత్తరువుల పై స్టే ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొన్నది. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను ముగించాలని హైకోర్టు కు సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు రేపు ఏపీ హైకోర్టులో ఈ కేసును విచారించబోతున్నారు.
పరిపాలన సౌలభ్యం, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన బిల్లులపై గవర్నర్ కూడా సంతకం చేశారు. దీంతో అమరావతి రైతులు హైకోర్టులో కేసులు దాఖలు చేయగా, హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది. మొదట ఆగష్టు 14 వరకు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు దానిని ఆగష్టు 27 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment