Skip to main content

పేద మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. సాయం చేస్తున్న సోను సూద్

 కరోనా కష్టకాలంలో సాయం చేయాలని కోరిన వెంటనే ప్రతి స్పందిస్తూ సినీనటుడు సోను సూద్ రియల్ హీరో అనిపించుకుంటోన్న విషయం తెలిసిందే. సాయం చేయాలంటూ తనకు వస్తోన్న ఫోన్లు, మెసేజ్‌లపైనే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన ప్రజల కష్టాలను గురించి తెలుసుకుని ఆయన సాయం చేస్తున్నారు.


కర్ణాటకలో యాదగిరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పద్మ అనే ఓ పేద మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చింది. అయితే, రెక్కాడితే కానీ డొక్కాడని పద్మ-నాగరాజ్‌ దంపతులకు ఆ బిడ్డలను పెంచడం తలకు మించిన భారమైంది. వారు ఓ చిన్న ఇంట్లో ఉంటున్నారు.

ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలన్న ఆందోళనలో వారు ఉన్నారు. వారి బాధల గురించి మీడియాలో వచ్చిన వార్తలు సోను సూద్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన దీనిపై స్పందించారు. తాను ఆ ముగ్గురు శిశువుల పోషణ కోసం సాయం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, వారి ఇంటికి మరమ్మతులు కూడా చేయిస్తానని చెప్పారు.  

Comments