Skip to main content

అన్న‌య్య త్వ‌ర‌గా కోలుకుని రండి, మీకోసం ఎదురు చూస్తున్నాః క‌మ‌ల్

 


సీనియ‌ర్‌ సింగ‌ర్ ఎస్పీ బాలసుబ్ర‌మ‌ణ్యం ఆరోగ్య ప‌రిస్థితిపై స్పందించారు.. ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌. ఈ మేర‌కు ఆయ‌న‌కు సంబంధించి క‌మ‌ల్ హాస‌న్‌ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ”ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య త్వరగా కోలుకోని రండి, మీకోసం ఎదురుచూస్తు నాను. నా సినీ జీవితంలో ఎన్నో సినిమాలకు మీ గాత్రం ద్వారా వన్నె తెచ్చారు. నా గొంతులో మీ స్వరం కలిసిపోయింది. అన్నయ్య మీరు మరిన్ని చిత్రాలకు పాటలు పాడాలని కోరుకుంటున్నాను” అంటూ ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు క‌మ‌ల్ హాస‌న్‌.

కాగా ప్రముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. క‌రోనా నుంచి కోలుకునేందుకు బాలుకి ప్లాస్మా ట్రీట్మెంట్ చేశారు ఎంజీఎం ఆస్పత్రి డాక్ట‌ర్లు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఐసీయూలో లైఫ్ స‌పోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం కంటే ప్ర‌స్తుతం ఆయ‌న‌ ప‌రిస్థితి కాస్త మెరుగ్గా ఉందని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఎస్పీబీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి వదంతులు నమ్మొద్దని ఆయ‌న‌ కుమారుడు ఎస్పీ చరణ్ సూచించారు.

Comments