Skip to main content

మహేష్ ను వదలనంటున్న డైరెక్టర్...

 సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘దూకుడు’ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో మహేష్ తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసి కడుపుబ్బా నవ్వించారు. ఇక శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అదే నమ్మకంతో ‘ఆగడు’ సినిమాకు ఒకే చెప్పాడు మహేష్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్ల పడింది. ఆ దెబ్బతో శ్రీను వైట్ల అంటే బాబోయ్ అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ‘ఆగడు’ సినిమా తర్వాత మహేష్ మళ్ళీ అలాంటి ప్రయోగాలు చేయకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. 'ఆగడు' సినిమా నుండి శ్రీను వైట్ల తన హిట్ ఫార్ములాతో తీసిన ప్రతి సినిమా ప్లాఫ్ అవుతూనే ఉంది. రామ్ చరణ్ తో తీసిన 'బ్రూస్ లీ'.. వరుణ్ తేజ్ 'మిస్టర్'.. రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.ఇప్పుడు 'దూకుడు' సినిమాకి సీక్వెల్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడట శ్రీను వైట్ల. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కి 'దూకుడు 2' స్టోరీ నేరేట్ చేయడానికి వైట్ల శ్రీను ప్రయత్నాలు చేస్తున్నారట. శ్రీను వైట్ల ప్రయత్నానికి మహేష్ ఓకే చెప్తాడా లేదా అనేది చూడాలి. దీంతో పాటు శ్రీను వైట్ల 'ఢీ' సినిమాకి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే మంచు విష్ణుతో ఈ విషయంపై డిస్కషన్స్ కూడా జరిగినట్లు సమాచారం.

Comments