ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడి గత పదిరోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్య సమాచారం పై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. బాలు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు శనివారం సాయంత్రం తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ బాలు ను పరామర్శించారు. బాలుకు అందుతున్న వైద్య చికిత్స వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. బాలుకు కరోనా నుండి కోలుకోవడానికి ప్లాస్మా చికిత్స అందిస్తున్నారని మరో రెండు రోజులు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తారని తెలిపారు.
Comments
Post a Comment