Skip to main content

వ్యాక్సిన్ అవసరం లేకుండానే... కరోనాను ఖతం చేసే ఔషధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు!

 


కరోనా సోకకుండా టీకాను కనుగొనేందుకు ఎన్నో దేశాలు తలమునకలై ఉన్న వేళ, కరోనా సోకిన వారి శరీరంలో నుంచి వైరస్ ను పారద్రోలే ఔషధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన కంప్యూటర్ సిములేషన్స్ ను వినియోగించి, ఇప్పటికే అందుబాటులో ఉన్న 'ఎబ్సెలీన్' కరోనా శరీరంలో పునరుత్పత్తి కాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుందని తేల్చారు. ఈ ఔషధాన్ని ఇప్పటికే పలు రకాల రుగ్మతలకు వినియోగిస్తున్నారు. ఇది యాంటీ వైరల్ గా, యాంటీ ఇన్ ఫ్లమేటరీగా, యాంటీ ఆక్సిడేటివ్ గా, బ్యాక్టీరిసైడల్ గా శరీరంలోని కణజాలాన్ని కాపాడేదిగా గుర్తింపు తెచ్చుకుంది. వినికిడి సమస్యలు ఉన్నవారితో పాటు, బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్న వారికి ఇస్తున్నారు.

శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలను 'సైన్స్ అడ్వాన్సెస్' జర్నల్ ప్రచురించింది. యూనివర్శిటీ ఆఫ్ చికాగో రీసెర్చర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, వైరస్ ఆర్ఎన్ఏ జన్యువుల్లో ఎంప్రో ప్రొటీన్లను తయారు చేయడం ద్వారా, అది ఆశ్రయించుకుని ఉన్న శరీరంలోని కణజాలంలో మరో వైరస్ ను పుట్టిస్తోంది. వేలాది బయొలాజికల్ మాలిక్యూల్స్ మోడల్స్ ను వినియోగించి, శాస్త్రవేత్తలు, వైరస్ కు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ వైరల్ మెటీరియల్ ను గుర్తించారు. వైరస్ లోని ఎంప్రోను నివారించే ఆయుధంగా ఎబ్సెలీన్ పనిచేస్తుందని అధ్యయనానికి కో-ఆథర్ గా పనిచేసిన చికాగో వర్శిటీ ప్రొఫెసర్ జువాన్ డీ పాబ్లో వ్యాఖ్యానించారు.

తమ అధ్యయనంలో భాగంగా ఎంజైమ్ మోడల్స్ ను అభివృద్ధి చేశామని, ఎబ్సెలీన్, రెండు విభిన్న మార్గాల ద్వారా ఎంప్రో యాక్టివిటీని తగ్గిస్తుందని గుర్తించామని తెలిపారు. దీంతో కరోనాను నమ్మకంగా నాశనం చేయవచ్చన్న నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులోనే ఎబ్సెలీన్ కొత్త ఔషధంగా కరోనాపై విరివిగా వినియోగంలోకి వస్తుందని అన్నారు.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.