ఆల్కహాల్ ను హోం డెలివరీ చేయడానికి ఫ్లిప్ కార్ట్ రెడీ అవుతోంది. ఇందుకోసం ఇండియన్ ఆల్కహాల్ హోం డెలివరీ యాప్ హిప్ బార్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆల్కహాల్ బెవరేజెస్ ను తయారు చేసే డియోజియో హిప్ బార్ లో 26 శాతం వాటా ఉంది. హిప్ బార్ కు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ గా ఫ్లిప్ కార్ట్ పనిచేయడానికి పశ్చిమ బెంగాల్ , ఒడిశా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయని నేషనల్ మీడియా పేర్కొంది. ఈ భాగస్వామ్యం వల్ల ఫ్లిప్ కార్ట్ యూజర్లు హిప్ బార్ యాప్ ను యాక్సె స్ చేసుకోవచ్చు. కస్టమర్లు తమకు కావాల్సి న ఆల్కహాల్ ను ఆర్డర్ పెట్ టు కుంటే హిప్ బార్ హోం డెలివరీ చేస్తుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు.
Comments
Post a Comment