కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ రాణా కోలుకుంటున్నారు. తనను ఐసీయూ నుంచి ఈ రోజు జనరల్ వార్డుకు మార్చారనీ.. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్టు ట్విటర్లో వెల్లడించారు. అభిమానుల ఆశీస్సులు తనతో ఉన్నాయన్న నవనీత్ కౌర్.. త్వరగా కోలుకుంటానని విశ్వాసం వ్యక్తంచేశారు. మళ్లీ ప్రజాసేవకు సిద్ధమవుతానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment