Skip to main content

ట్రంప్ కుటుంబంలో విషాదం... సోదరుడి కన్నుమూత


 ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విషాదం నెలకొంది. ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ అనారోగ్యంతో కన్నుమూశారు. రాబర్ట్ ట్రంప్ వయసు 71 సంవత్సరాలు. పారిశ్రామికవేత్త అయిన రాబర్ట్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొన్నినెలలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో శనివారం రాత్రి మృతి చెందారు. సోదరుడి మృతి పట్ల ట్రంప్ కదిలిపోయారు.

"రాబర్ట్ నా తమ్ముడు మాత్రమే కాదు, నాకు ఆప్త మిత్రుడు కూడా. తమ్ముడి జ్ఞాపకాలు నా మనసు నుంచి వీడిపోవు. రాబర్ట్ ఎంతో శాంత స్వభావి. నా లైఫ్ లో నేను హనీ అని పిలిచే ఏకైక వ్యక్తి రాబర్ట్ మాత్రమే. మళ్లీ కలుసుకుందాం తమ్ముడూ!" అంటూ విషాద ప్రకటన చేశారు. కాగా, రాబర్ట్ ట్రంప్ చివరి క్షణాల్లో ఉన్నారని వైట్ హౌస్ అధికారులు ట్రంప్ కు తెలియజేయగా, శుక్రవారం ఆయన ఆసుపత్రికి వెళ్లి తమ్ముడ్ని కడసారి పరామర్శించారు.

Comments