Skip to main content

నేటి ట్వీట్లు

ధోని రిటైర్మెంట్ పై మహేష్ ట్వీట్...ఎలా మరచిపోగలం అంటూ


వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన మహీ... రీఎంట్రీపై వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఉహించని విధంగా షాకిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు ధోని. ఇన్నాళ్లూ మీరు చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యావాదాలు అంటూ తెలుపుతూనే..ఆదివారం రాత్రి 7 గంటల 29 నిమిషాల నుంచి రిటైర్ అయినట్లుగా భావించాలని తన కామెంట్‌లో పోస్టు చేశాడు ధోని. అయితే.. ధోని రిటైర్మెంట్ పై ప్రిన్స్ మహేష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో సిక్సర్ బాది భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఉద్వేగభరితమైన దృశ్యంకి సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం. 2011 ప్రపంచకప్ ఛాంపియన్స్ !! వాంఖడే స్టేడియంలో ఉన్నట్టు ఉంది. ఆ సన్నివేశాలు తలచుకుంటే గర్వంగా ఉంది. ఎమోషనల్ అవుతున్నా. క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు అంటూ మహేష్ ట్వీట్ చేశారు.


 

 



కంగ్రాచ్యులేషన్స్ ధోనీ..సీఎం జగన్ ట్వీట్

టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో దోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఆయన అభిమానులు ధోని రిటైర్మెంట్ తో కలత చెందుతున్నారు. ఇకపై ధోనిని ఇంటర్నేషనల్ క్రికెట్ లో చూడలేమని ఆవేదన చెందుతున్నారు. ఇక తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ లో ధోనికి అభినందనలు తెలిపారు. "నీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు ధోని. మీరు వదిలివేస్తున్న వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాబోయే తరాల క్రికెట్  ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు." అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. 


Comments