“All I want is to save her!”
— People's Daily, China (@PDChina) August 29, 2020
Surveillance camera captured the touching moment when a young mom put her child on the floor to help an elderly woman who fainted from a heart attack in Xunyang County, northwest China's Shaanxi Province. pic.twitter.com/mkoRMlJhsu
అపార్టుమెంటులోని లిఫ్టులో ఓ వృద్ధురాలు గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఆ లిఫ్టులో ఆమె ఒక్కతే ఉంది. కాసేపటికి లిఫ్టు తెరుచుకున్నాక బయటి నుంచి లిఫ్టులోకి వచ్చిన ఓ యువతి ఆ వృద్ధురాలిని చూసింది. అంతే, ఆమెను కాపాడడమే లక్ష్యంగా ఆ యువతి తన పసిబిడ్డను లిఫ్టు బయట పడుకోబెట్టి వచ్చేసింది. ఆ వృద్ధురాలి గుండె పంపింగ్ తగ్గిపోవడంతో ఆమె దాన్ని సరిచేసేందుకు ప్రథమచికిత్సలో భాగంగా ఆ యువతి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
తన పసిబిడ్డ లిఫ్టు బయట ఏడుస్తున్నప్పటికీ వృద్ధురాలిని బతికించేందుకు ఆమె ఆరాట పడి, చివరకు ఆమె ప్రాణాలను కాపాడింది. ఆ సమయంలో ఆ వృద్ధురాలిని కాపాడడమే తనకు ముఖ్యంగా అనిపించిందని ఆ యువతి చెప్పింది. ఈ ఘటన వాయవ్య చైనాలోని జున్యాంగ్ కౌంటీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ యువతిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Comments
Post a Comment