ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రముఖ సింగర్ ఆసుపత్రి పాలైంది అయ్యింది.ఇండియన్ ఐడల్ తో సింగర్ రేణు నగర్ పాపులర్ అయ్యింది. దేశంలో మంచి సింగర్ గా ఆమెకు మంచి పేరుంది . అయితే తన ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో రేణు ఆరోగ్యం క్షీణించింది. ఆమెను జైపూర్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అసలు విషయం ఏంటంటే .. సింగర్ రేణు నగర్ పెళ్ళైన రవిశంకర్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు ఇంటినుంచి పారిపోయారు. కూతురు కనిపించకపోవడంతో రేణు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు . పోలీసులు ఆగష్టు 24న వీరి జాడను కనిపెట్టి తిరిగి తీసుకువచ్చారు. ఈక్రమంలో బుధవారం రవిశంకర్ విషంతాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెల్సుకున్న రేణు సృహతప్పిపడిపోయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో చిక్సిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Post a Comment