Skip to main content

శ్రీదేవి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి: ఉద్యమం ప్రారంభించిన అభిమానులు



 ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ ప్రారంభమైంది. అయితే, ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల క్రితం దుబాయ్‌లో ప్రాణాలు కోల్పోయిన శ్రీదేవి కేసులో కూడా సీబీఐ విచారణ జరపాలని ఆమె అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం ప్రారంభించారు.  

 
దుబాయ్‌లో ఓ వేడుకకు వెళ్లి అక్కడే తాను ఉన్న హోట‌ల్ గదిలోని బాత్ ట‌బ్‌లో ప‌డి శ్రీదేవి ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సందర్భంగా ఆమె మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె అభిమానులు ఇప్పటికీ  అనుమానాలను వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు.  

సుశాంత్ మృతిలో సీబీఐ విచారణ కొనసాగుతుండడం, ఆగ‌స్టు 13న శ్రీదేవి జయంతి ఉండడం వంటి అంశాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆమె అభిమానులు సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి హ్యాష్ ట్యాగ్‌తో ఆమె మృతిపై విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఈ డిమాండ్ ఊపందుకోవడం గమనార్హం.  

Comments