Skip to main content

టాలీవుడ్ లో దుమారం..! సినిమా షూటింగులపై వాస్తవాలు దాచారా…? |

 


సినీరంగంలో చాలా మందికి కరోనా సోకింది. నిజమే..!
షూటింగులు ఆగిపోయాయి. నిజమే…!
షూటింగులుకి అనుమతులు ఇవ్వాలంటూ చిరు, నాగార్జున కేసీఆర్ తో భేటీ వేశారు. నిజమే…!!
ఇన్ని నిజాలు వెనుక మరో కఠోర నిజమూ ఉంది. షూటింగుల అనుమతుల్లో మతలబు ఉంది.., సీనియర్లు దాచిపెట్టిన తతంగమూ ఉంది. తెరబయట చర్చల్లో బయటపడని రహస్యము ఉంది.. అది ఇప్పుడు టాలీవుడ్ లో ఆ నోటా, ఈ నోటా పాకుతుంది. కానీ ఎవ్వరూ ఏమి అనలేక, చేయలేక గమ్మునున్నారు. ఇంతకూ ఏమిటా నిజం అంటే…!!


కేసీఆర్ పెట్టిన మెలిక ఏమిటి…?

చిరు, నాగార్జున బృందం కేసీఆర్ తో భేటీ అయిన వార్త పాత అంశమే. కానీ దీనిలో దాచిన పాయింట్లే ఇప్పుడు కొత్తవి. అవే ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. “కేసీఆర్ తో భేటీ సందర్భముగా షూటింగులకు అనుమతులు ఇవ్వాలి అంటూ నటులు, సినీ పరిశ్రమ ప్రతినిధులు కోరారు. కాస్త ఆలోచించిన కేసీఆర్ 60 ఏళ్ళ పైబడిన వారు తప్ప… ఈ వయసు లోపు ఉన్న వాళ్లకు అనుమతులు ఇస్తాము అన్నారు. కానీ ఈ మెలిక మనోళ్లకు నచ్చలేదు. ఎందుకా అని ఆరాతీస్తే … భేటీకి వెళ్లిన చిరంజీవి వయసు 65 .., నాగార్జున వయసు 61 .., ఇలా పెద్దోళ్ళు వెళ్లారు. వీరికి కేసీఆర్ పెట్టిన మెలిక నచ్చలేదు. అందుకే వద్దులే, షూటింగులతో మాకే రిస్కు… మొత్తం తగ్గిన తర్వాత చూద్దాం లే అంటూ వచ్చేసారు.


70 శాతం షూటింగులు జరిగే అవకాశం ఉంది…!!

నిజానికి కేసీఆర్ ఇచ్చిన ప్రాధమిక అనుమతుల మేరకు సినీ పరిశ్రమలో 70 శాతం షూటింగులు జరుపుకునే వీలుంది. నడి వయస్కులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సహా… యువ హీరోల షూటింగులకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. పైగా హీరోలు, ప్రొడ్యూసర్లు తప్ప సినీ పరిశ్రమలో మిగిలిన అందరూ 50 ఏళ్ళ లోపు వారే అధికంగా ఉంటారు. మొఖ్యంగా షూటింగ్ లో కీలక పాత్ర పోషించే అసిస్టెంట్లు సగటు వయసు 40 .., టెక్నిషియన్ల వయసు కూడా ఇంచుమించుగా అంతే ఉంటుంది. సో… ఎలా చూసినా కేసీఆర్ ఇచ్చిన అనుమతులు వాడుకుంటే పరిశ్రమలో కొంత మేరకు షూటింగులు జరిగేవేమో…! కానీ వాటిని మన స్టార్లు సున్నితంగా తిరస్కరించారు. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ లో భిన్న స్వరాలొస్తున్నాయి. “సరేలే ఇదీ మంచికే షూటింగులకు వెళ్తే కరోనా విపరీతంగా సోకేది.., మనోళ్లు మంచి పనే చేశారు” అంటూ కొందరు మంచి చెప్పుకుంటుంటే…, వయసు మళ్ళిన హీరోలు వెళ్లి కుర్ర హీరోలు, ఇతర టెక్నిషియన్లకు దెబ్బ కొట్టారంటూ ఇంకొందరు చెప్పుకుంటున్నారు. బయటకు చెప్పకపోయినా సినీ పరిశ్రమలో అంతర్గతంగా ఈ చర్చ ధారాళంగా ఉంది.

Comments