టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఆదివారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు మొక్కలు నాటారు. అయితే ఆయన మొక్కలు నాటుతున్న సందర్భంలో మాస్కును ధరించలేదు. దాంతో బహిరంగ ప్రదేశంలో మాస్క్ లేకుండా తిరిగినందుకు ఆయనకు వెయ్యిరూపాయలు జరిమానా విధించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో 24 గంటల్లో 3.1 కోట్ల ట్వీట్స్ ఇండియాలో బిగ్గెస్ట్ ట్రెండింగ్ గా నిలిచారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రిన్స్ కు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment