ఆస్క్ మీ పేరుతో ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ ఏపీ సీఎం జగన్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయన్నాయని, అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని అన్నారు. అంతే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని మరి కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి వసతులు ఉన్నాయని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 23వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని ఆ సంఖ్యను త్వరలో 40వేలకు పెంచుతామని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ఆయుష్మాన్ భారత్ కంటే మెరుగైనదని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం కొత్తగా 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. అన్ని ఏరియా ఆస్పతుల్లో ఐసీయూ యూనిట్స్ మొదలుపెట్టామని, ఉచితంగా డయాలసిస్ కూడా నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ప్రజా రవాణా తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నామన్నారు.
Comments
Post a Comment