కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కి కరోనా
సోకింది. లక్షణాలు కనిపించడంతో 2 సార్లు కరోనా టెస్ట్ చేయించుకోగా, రెండోసారి పాజిటివ్ గా తేలినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం మంత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. తనను కలిసిన వారు, తనతో సన్నిహితంగా ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ నుంచి బిజెపి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ కంపెనీ తయారు చేసిన పాపడ్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.,
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment