Skip to main content

అదరగొట్టే బీజీఎంతో 'సర్కారు వారి పాట'...మోషన్ పోస్టర్ ఇదే!

 


టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ ఉదయం ఆయన 25వ చిత్రం 'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ విడుదలైంది. ఆపై నిమిషాల వ్యవధిలోనే ఇది వైరల్ గా మారింది. ఈ మోషన్ పోస్టర్ లో రూపాయి నాణాన్ని చూపిస్తూ, దాన్ని మహేశ్ బాబు గాల్లోకి ఎగరవేస్తూ కనిపిస్తారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా 'సర్కారు వారి పాట' హుక్ లైన్ చిన్న బీట్ గా వినిపిస్తుంది.

ఇందులో మహేశ్ ముఖం కనిపించక పోవడం మాత్రం ఫ్యాన్స్ ను ఒకింత నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. కాగా, ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టెయిన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Comments