ఆదిత్య 369 డిఫారెంట్ స్టోరీతో ఆకట్టుకున్నదర్శకుడు సంగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రానికి శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ, మోహిని, అమ్రిష్ పూరి, టిన్ను ఆనంద్, తరుణ్ కుమార్లు లీడ్ రోల్స్ పోషించారు. సంగీతం, సినిమాటోగ్రాఫీలను ఇళయరాజా, వీఎస్ఆర్ స్వామి చూసుకున్నారు. ఆదిత్య 369 చిత్రంలో టైమ్ మిషన్ ప్రజెంట్ టైం నుంచి పాస్ట్ టైంలోకి తీసుకెళ్లుంది. సంగీతం శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ఆదిత్య 999 చిత్రం వస్తుందని గతంలో రూమర్స్ వినిపించాయి. అందులో బాలయ్య నటిస్తున్నరని కూడా విన్నాం. బాలయ్యకు అనుకున్న ప్రాజెక్టు ఆదిత్య 999లో అనూహ్యంగా ఆయన వారసుడు మోక్షజ్ఞ వచ్చారు. మరి మోక్షజ్ఞ నటిస్తారో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకు రూమర్‌గానే భావించాల్సి ఉంటుంది.
ఆదిత్య 369 చిత్రం నందమూరి బాలకృష్ణకు పెద్ద హిట్ ఇచ్చింది. రెండు నంది అవార్డులు, బెస్ట్ కాస్టూమ్స్ డిజైన్, ప్రొడక్షన్ డిజైన్ అవార్డులను దక్కించుకుంది. ఇది అప్పట్లో ఇండస్ర్టీ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం సైంటిస్ట్ రాందాస్‌తో మొదలవుతోంది. రాందాస్ తన ఇంటిలోనే ఏర్పాటు చేసుకున్న ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తుంటారు. అందులో ఈ టైం మిషన్ ఒక్కటి. దానిని విజయవంతంగా తీర్చిదిద్దుతాడు. అతని కూతురే హేమ, ఆమె ప్రియుడు కృష్ణ కుమార్(బాలకృష్ణ) ఊహించని విధంగా టైం మిషన్తో సహా శ్రీకృష్ణదేవరాయలు జీవించి ఉన్న క్రీ.శ 1522 కాలానికి వెళతారు. మరలా భవిష్యత్తు కాలానికి వెళతారు. 2504 మూడో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భూమి మీద రేడియోషన్ ప్రభావం నెలకొని ఉంటుంది.
ఇలా కొన్ని ముఖ్య అంశాలతో ఈ చిత్రం సమ్మిళతై ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు హయాం నాటి డైమాండ్ మ్యూజియంలో అత్యంత భద్రతల మధ్య ఉంటుంది. ఈ మ్యూజియంలో ఉన్నడైమాండ్‌ను పేరుమోసిన దొంగ రాజవర్మ అత్యధిక విలువ గల వస్తువులను చోరీ చేస్తుండడం హాబీగా పెట్టుకుంటాడు. ఓరిజినల్ డైమాండ్నుదొంగతనం చేస్తుండగా స్కూల్ విద్యార్థి కిషోర్ చూస్తాడు. అయితే స్కూల్ ఎక్స్‌కర్షన్ రీత్యా వచ్చి మ్యూజియంలో చిక్కుకుపోతాడు. దొంగల నుంచి తప్పించుకు నేందుకు యత్నిస్తుంటాడు. రంగంలోకి దిగిన కృష్ణ కుమార్ అతడిని రక్షిస్తాడు. తర్వాత రాజవర్మకు కృష్ణ కుమార్‌కు మధ్య గొడవతో రాజవర్మ చనిపోతాడు. ఇదీ ఆదిత్య 369 హిట్ స్టోరీ గురించి.
Comments
Post a Comment