Skip to main content

జగన్‌కు మూడో స్థానం దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో


దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య  ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ది నేషన్‌ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాగా.. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(4), ఇతరులు(5), బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌(6), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే(7), ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌(8), రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లట్‌(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 మధ్య 12,021 మందితో టెలిఫోన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభిప్రాయాలు సేరరించారు. 

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.