.
యూనివర్సిటీ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేసిన టీకా ట్రయల్స్‌లో సత్ఫలితాలను ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు ఎందరిలోనో ఆశలు పుట్టించాయి. అయితే ఈ టీకా బయటికి వస్తే ధర చాలా ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో కీలక గుడ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయనుంది. మన దేశానికి చెందిన ఈ సంస్థ నేడు కీలక ప్రకటన చేసింది. భారత దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను రూ.225కే అందించనున్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రెండు కలిసి కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి భారత్‌కు చెందిన ఫార్మా కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభంలో 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేసి భారత్‌తోపాటు ఇతర దేశాలకు అందించనుంది. కరోనా వ్యాక్సిన్ విషయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ప్రజల కోసం కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసును కేవలం రూ.225కే విక్రయిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.
కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే ఒక్క వ్యాక్సిన్ వల్లనే సాధ్యమవుతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్ తయారుదిశగా పలు దేశాలు విశేషంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్-19 కు వ్యాక్సిన్ తేవడంలో విశేషంగా కృషి చేస్తోంది సీరమ్ ఇన్‌స్టిట్యూట్. ఈ సంస్థ యజమానులు కోటిశ్వరులైనప్పటికీ ఎలాంటి బేషజాలు లేకుండా సమాజం అభివృద్ధే లక్ష్యంగా పాటుపడుతున్నారు. అందుకే ఇంత తక్కువ ధరలో, రూ.225కు కరోనా వ్యాక్సిన్ టీకాను అందిస్తున్నారు.]]>
Comments
Post a Comment