Skip to main content

ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా పాజిటివ్..



 కరోనా వైరస్.. ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఎస్పీబీ అభిమానులకు తెలియజేశారు.

”గత రెండు రోజులుగా జ్వరం ,దగ్గుతో బాధపడుతున్నాను. వైద్య పరీక్షల అనంతరం కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంది. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. మీ అశీస్సులతో తొందరలోనే కోలుకుంటాను”. అని ఎస్పీబీ వీడియోలో పేర్కొన్నారు.

Comments