వినాయక చవితి వస్తుంది అంటేనే అందరి చూపులు ఖైరతాబాద్ లో కొలువుదీరే మహా గణపతి పైనే ఉంటాయి , భారీ గణపతి విగ్రహాల్లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కొలువుదీరే మహా గణపతికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే భారీ గణనాధుని తిలకించేందుకు లక్షలాది మంది వస్తుంటారు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2020 సంవత్సరానికి గాను ఖైరతాబాద్ మహాగణపతిని కేవలం 6 అడుగుల ఎత్తుతో మట్టితో తయారుచేస్తున్నామని ” ధన్వంత్రి నారాయణ మహాగణపతి” ఆకారంలో వినాయకుడి తయారు చేస్తున్నట్లు తెలిపారు
ఖైరతాబాద్: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులను బుధవారం ఉదయం ప్రారంభిస్తున్నట్లు ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment