అయోధ్యలో రామధామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ
జరిగింది. ఆగమ పండితులు ప్రధాని చేతుల మీదుగా ఈ క్రతువు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్,
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్,
ఇతర ప్రముఖులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ
ట్రస్టు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా
ఉన్న రామభక్తులు ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు
చేసింది.
భూమి పూజలో నక్షత్రాకారంలో ఉన్న అయిదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ఆ వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆగమ పండితుల భావన. అయోధ్యలో భూమి పూజ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Post a Comment