Skip to main content

లెబనాన్ రాజధానిలో భారీ పేలుళ్లు.. భయానక దృశ్యాలు


వీడియో చూడండి:https://youtu.be/FSpm4PU8NVk

లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లతో వణికిపోయింది. పేలుడు ధాటికి ఇళ్లలో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. బాల్కనీలు కుప్పకూలాయి. జనం భయంతో పరుగులు తీశారు.వందలాది మంది గాయపడినట్లు తెలుస్తోంది. 10 మంది మరణించినట్లు కొంత మంది మీడియా ప్రతినిధులు ట్విటర్ ద్వారా తెలిపారు. భారీ ప్రాణ నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పేలుళ్లతో జనం వణికిపోయారు. వీధుల వెంట పరుగులు తీశారు. మొదటి పేలుడు సంభవించిన కాసేపటికే రెండో పేలుడు సంభవించినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా వెబ్‌సైట్లలో రాశారు.B

 
పేలుడు ధాటికి ఇళ్లలో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. పలు ఇళ్లలో బాల్కనీలు కుప్పకూలాయి. ఒక్కసారిగా భూమి కంపించినంత పని అయిందని సోషల్ మీడియాలో కొంత మంది కామెంట్లు పెట్టారు. పేలుడు అనంతరం దట్టమైన పొగ కమ్ముకుంది. కొన్ని వీడియోల్లో జనం ఆర్తనాదాలు చేయడం వినిపిస్తోంది.

లెబనాన్‌ పేలుళ్లకు సంబంధించిన ఫోటోలు ట్విటర్‌లో వైరల్ అవుతున్నాయి. లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్‌లోని పోర్ట్ ఏరియాలో మంగళవారం (ఆగస్టు 4) సాయంత్రం ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగా భారీ పేలుడు సంభవించిందని కొన్ని మీడియా కథానాల్లో పేర్కొన్నారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.