Skip to main content

ఆధునిక భారతదేశానికి ఇది చిహ్నం- రాష్ట్రపతి

ఆధునిక భారతదేశానికి ఇది చిహ్నం- రాష్ట్రపతిసాకేత పురంలో రాముడికి భూమి పూజ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ రామ్‌నాథ్ కోవింద్‌ ట్వీట్ చేశారు. అయోధ్యలో నిర్మిస్తున్నరామమందిరం. రామాయణంలోని సిద్ధాంతాలు, విలువలకు అద్దం పడుతుందని, ఆధునిక భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుందని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

చట్టబద్ధంగా నిర్మిస్తున్న రామాలయం భారతదేశం యొక్క సామాజిక సామరస్యం, ప్రజల ఆంకాక్షకు ప్రతిరూపమని పేర్కొన్నారు. భూమిపూజలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

Comments