Skip to main content

ఎప్పటి నుంచో వున్న ఈ పథకానికి జగన్ తండ్రి పేరు పెట్టడం విడ్డూరం: ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ఏపీలో ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రభుత్వం ఈరోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు  విమర్శలు గుప్పించారు. ఈ పథకం ఎప్పటి నుంచో వున్నదేనని, దీనికి కేంద్రమే అరవై శాతం నిధులిస్తోందని చెప్పారు. అయితే, ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వమే అమలు చేస్తున్నట్టుగా భావించి దీనికి సీఎం జగన్ తన తండ్రి పేరు పెట్టడం విడ్డూరంగా వుందని విమర్శించారు.

రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సరైన విధానమంటూ లేదని, పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడం సరికాదని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు. ఏపీలో పోలీసుల దుర్నీతి గురించి బాబు ప్రశ్నిస్తున్నారని, టీడీపీ హయాంలో బీజేపీ నేతలపై రాళ్లు వేయించలేదా? కేసులు పెట్టించలేదా? అని విమర్శించారు. ఆనాడు ఏం చేశారు? ఇప్పుడు కళ్లు తెరిచారా?’ అని బాబును ప్రశ్నించారు

Comments