పోస్టల్ శాఖ తరపున ప్రజలకి ఎన్నో సేవలు అందిస్తున్నామని, విదేశాలు వెళ్లేందుకు కావాల్సిన పాస్ పోర్ట్ కూడా తపాలాశాఖ ద్వారా పొందవచ్చన్నారు విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎలీషా... మీడియాకు చెప్పారు. గురువారం వరల్డ్ పోస్ట్ డే సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాలో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే పోస్ట్‌డేని ఈనెల 9 నుంచి 15 వరకు వారోత్సవాలు గా రోజువారీ కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని చెప్పారు.
10న పోస్టల్ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రజలకు తెలుపుతారు. SBI తర్వాత పోస్టల్ లోనే ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్నారని, వీటిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.11వ తేదీన గ్రామీణ ఇన్సూరెన్స్ స్కీంపై అవగాహన కల్పిస్తామన్నారు. 12వ తేదీన పాఠశాలల్లో పిల్లలకు స్టాంపుల పై తమ సిబ్బంది తెలియజేస్తారని,14న వ్యాపార వేత్తలకు పోస్టల్ శాఖ అందించే సేవలను తెలిపి కొత్త ఖాతాదారుల పెంపుకు కృషి చేస్తారన్నారు. అలాగే15న పోస్టల్ మెయిల్ కార్యకలాపాలని ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు.
ఇప్పటి వరకు ఎపి లో 575 ఆధార్ కేంద్రాలు పోస్టల్ శాఖ తరపున ఏర్పాటు చేశామని, దాదాపు అన్ని పోస్టాఫీసులలొ అన్ని రకాల లావాదేవీలు పూర్తి గా డిజిటలైజ్ చేశామని తద్వారా గ్రామీణ ప్రాంతాలలో సైతం అన్ని రకాల సేవలు ఆన్ లైన్ లో ఉంటాయని చెప్పారు.ప్రజలకు చేరువుగా ఉండే పోస్టల్ శాఖ లో బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని కోరుతున్నామని, ఆప్ కా బ్యాంక్.. ఆప్ కా ద్వార్ నినాదంతో ఇంట్లో ఉండే లావాదేవీలు చూసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. పోస్టల్ లో ఖాతా ప్రారంభానికి కేవలం ఒక్క ఆధార్ ఫ్రూఫ్ సరిపోతుందని తెలిపారు. ఎ విషయం పైన అయినా నేరుగా పోస్టల్ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని ఖాతాదారులకు ఆయన సూచించారు.
ఇప్పటివరకు 1.29కోట్ల ఖాతాలు పోస్టల్ శాఖ లో ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2,700 మంది ని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త గా నియమించేందుకు నిర్ణయించామని ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో ప్రకటిస్తామని ఎలీషా చెప్పారు.
Comments
Post a Comment