తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, సమ్మెకు మద్దతుగా ఉండాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు రేపు లేఖలు అందజేస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, పార్టీలు ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు. రేపు, ఎల్లుండి ఆర్టీసీ డిపోల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తి పాల్గొని తమ నిరసన తెలిపాలని కోరారు.
సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ చేపట్టే నిరసన కార్యక్రమాలకు మద్దతుగా తమ పార్టీ శ్రేణులు పాల్గొంటాయని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యులు కావాలని కోరారు. కాగా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించనున్నారు.
Comments
Post a Comment