Skip to main content

ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణ ప్రారంభం

సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణను
అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల్లో కొనుగోళ్లు, సేవలకు ఆన్ లైన్ లో టెండర్లు పిలిచేలా కొత్త విధానం రూపకల్పన చేశారు. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమలు చేసేలా కార్యాచరణకు దిగనుంది. ఇకపై ప్రభుత్వ కొనుగోళ్లన్నీ ఈ-ప్లాట్ ఫాం వేదికగానే జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, అన్ని ప్రభుత్వ శాఖల కొనుగోళ్లకు ఏకరూప విధానాన్ని ప్రభుత్వం రూపొందించనుంది. ప్రతి ఏటా సామగ్రి కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లు, సేవలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. ప్రస్తుతం ఇ-ప్రొక్యూర్ మెంట్ లో రూ.3,181 కోట్ల మేర కొనుగోలు చేస్తున్నట్టు, టెండర్లు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నట్టు, నాసిరకం సామగ్రి సరఫరా అవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. కొనుగోళ్లు, చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్టు ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ఇ-ప్రొక్యూర్ మెంట్ విధానాన్ని అమలు చేయనుంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.