Skip to main content

మహిళను హిప్నటైజ్ చేసి, అత్యాచారయత్నం చేసిన అమెజాన్ డెలివరీ బాయ్!


ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన అమెజాన్ డెలివరీ బాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, 43 ఏళ్ల ఓ మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. అమెజాన్ లో ఆమె ఐదు బాక్స్ లను బుక్ చేసింది. పార్సిల్ డెలివరీ అయిన తర్వాత చూస్తే అవి ఆమెకు నచ్చలేదు. దీంతో, వాటిని వెనక్కి తీసుకెళ్లాలంటూ రిటర్న్ రిక్వెస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో, వాటిని తీసుకునేందుకు ఓ డెలివరీ బాయ్ (30)ను అమెజాన్ పంపింది.

కస్టమర్ నివాసానికి వెళ్లిన సదరు డెలివరీ బాయ్ ఐదు బాక్సులను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. నాలుగు బాక్సులు మాత్రమే తీసుకోవాలని తనకు చెప్పారని తెలిపాడు. ఈ నేపథ్యంలో, ఇరువురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో బాధితురాలు కస్టమర్ కేర్ తో ఫోన్ ద్వారా మాట్లాడి... ఐదు బాక్సులను తీసుకోవడానికి డెలివరీ బాయ్ నిరాకరిస్తున్నాడని తెలిపింది. నాలుగు బాక్సులు తీసుకోవడానికే అతనికి అనుమతి ఉందని... ఐదు బాక్సులను తీసుకునేందుకు మరో వ్యక్తిని పంపుతామని కస్టమర్ కేర్ ప్రతినిధి చెప్పాడు.

కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ వచ్చిన ఆ డెలివరీ బాయ్ ఐదు బాక్సులనూ రిటర్న్ తీసుకుంటానని చెప్పాడు. కానీ, మరో వ్యక్తిని పంపిస్తానని కస్టమర్ కేర్ వాళ్లు చెప్పారని, బాక్సులను నీకు ఇవ్వనని బాధితురాలు స్పష్టం చేసింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె హిప్నాటిజంకు గురైంది. స్పృహ సరిగ్గా లేని స్థితిలో ఉన్న ఆమెపై డెలివరీ బాయ్ అత్యాచార యత్నం చేశాడు.

అయితే, కాసేపట్లోనే హిప్నటైజ్ స్టేజ్ నుంచి బయటకు వచ్చిన ఆమెకు... తన ముందు నిలబడి ప్యాంటును జారవిడిచిన స్థితిలో డెలివరీ బాయ్ కనిపించాడు. వెంటనే తేరుకున్న ఆమె... భయాందోళనలతో కేకలు వేసింది. దీంతో, అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఈ సోమవారం మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో చోటు చేసుకుంది. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.