Skip to main content

మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్..

 


కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు వెల్లడైంది. ఓబుళాపురం మైనింగ్ స్కాంలో గత ఐదేళ్లుగా గాలి కండిషనల్ బెయిల్ పై బయట ఉన్నారు.

అయితే ఇటీవలే కర్ణాటక ఆరోగ్యమంత్రి బి.శ్రీరాములుకు మాతృవియోగం కలిగింది. తన సన్నిహితుడైన శ్రీరాములు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గాను... గాలి సుప్రీం కోర్టును అభ్యర్థించి బళ్లారి వెళ్లేందుకు రెండ్రోజుల ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అయితే, తనకు కరోనా సోకిందని, బళ్లారి వెళ్లలేకపోతున్నానని గాలి సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా, లక్షణాలు ఏవీ లేకపోవడంతో ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.  

Comments