Skip to main content

ట్రంప్‌కు మళ్లీ షాకిచ్చిన ట్విట్టర్.. ట్వీట్ తొలగింపు..




 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను ట్విట్టర్ మరోమారు తొలగించింది. యూఎస్‌లో కేవలం 6 శాతం మంది మాత్రమే కరోనా కారణంగా మరణించారని, మిగతా 94 శాతం మంది వివిధ వ్యాధుల కారణంగా మరణించినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొందంటూ ట్రంప్ మద్దతుదారుడు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను ట్రంప్ రీట్వీట్ చేశారు.

నిజానికి సీడీసీ ఇలా చెప్పలేదు. 6 శాతం మందికి అది జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాల్లో వారి మరణానికి కారణం కరోనా అని ప్రస్తావించింది. మిగతా వారు కరోనాతోపాటు, ఇతర వ్యాధుల కారణంగా మరణించినట్టు పేర్కొంది. అయితే, ట్రంప్ మద్దతుదారుడు మాత్రం దానిని వేరేలా అన్వయించుకుని ట్వీట్ చేశాడు. దానిని ట్రంప్ రీట్వీట్ చేశారు. దీంతో ట్రంప్ రీట్వీట్‌ను ట్విట్టర్ తొలగించింది. గతంలోనూ ట్రంప్ ట్వీట్లు ఇలాంటి కారణాలతో  పలుమార్లు తొలగింపునకు గురయ్యాయి.  

Comments