Skip to main content

నీట్, జేఈఈ : రియల్ హీరో రంగంలోకి


విద్యార్థులకు అండగా సోనూ సూద్

సౌకర్యాల లేమి కారణంగా ఏ ఒక్కరూ ఎగ్జామ్ మిస్ కావొద్దు!

కరోనా పరిస్థితుల నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన  బాలీవుడ్ నటుడు సోనుసూద్  ప్రస్తుత పరిస్థితుల రీత్యా తనదైన శైలిలో కార్య రంగంలోకి దిగిపోయారు. ఈ పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించి తీరుతామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  కరాఖండిగా తేల్చి చెప్పింది. దీంతో విద్యార్థులకు అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్న సోనూ సూద్ అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు.  

ఒకవైపుకోవిడ్-19 రిస్క్, మరోవైపు తండ్రి పేదరికం, లోన్ల బెడద తదితర ఆర్థిక కష్టాల నేపథ్యంలో చాలాదూరంలో ఉన్న పరీక్ష కేంద్రానికి ఎలా వెళ్లాలి.. దయచేసి సాయం చేయండి అంటూ కన్నీరు మున్నీరవుతున్న విద్యార్థి ఆవేదనను  సోనూ షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్  తాజా నిర్ణయం తీసుకున్నారు.  

నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ ఖాయమైతే..ఆయా ప్రాంతాల విద్యార్థులు పరీక్షా కేంద్రాలను చేరుకోవడానికి కావల్సిన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా బిహార్, అస్సాం, గుజరాత్ లోని వరద బాధిత ప్రాంతాలలో పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులందరికీ నేనున్నాంటూ భరోసా ఇచ్చారు. బాధిత విద్యార్థులు దీనికి సంబంధించిన సమాచారాన్ని తనకు అందించాలని, ఏ ఒక్కరు కూడా ఈ పరీక్ష మిస్ కావడానికి వీల్లేదని ట్వీట్ చేశారు.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.