Skip to main content

టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహోత్సవాలు

తిరుమలఅన్నమయ్య భవన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ వై.వి. సుబ్సారెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి అధిక స్థాయిలో ఉందని.. ఈ పరిస్థితుల్లో స్వామివారి వాహన సేవలు మాఢవీధుల్లో నిర్వహించే పరిస్థతి లేదన్నారు. బ్రహోత్సవాలు ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని తెలిపారు. అధిక మాసం కారణంగా రెండు సార్లు బ్రహోత్సవాలు వచ్చాయని వివరించారు. అక్టోబర్‌లో ఉత్సవాల సమయానికి కరోనా ప్రభావం తగ్గితే.. యథాతధంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.

టీటీడీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..

విజయవాడ సమీపంలోని పోరంకిలో టీటీడీ కల్యాణ మండపాన్ని నిర్మించడానికి అంగీకరించారు. తిరుమలలోని చెత్తను కంపోస్ట్‌గా మార్చి రైతులకు ఇచ్చే అంశంపైనా చర్చ జరిగింది. కొండ మీద టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయిందని దాన్ని వెంటనే తరలించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రతీ నెల డిపాజిట్ల ద్వారా వడ్డీ వచ్చేలా బ్యాంకులో డిపాజిట్‌ చెయ్యాలని నిర్ణయించింది టీటీడీ. ఎక్కువ శాతం వడ్డీ రావడానికి బంగారం డిపాజిట్‌ 5 సంవత్సరాలకు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా పాత నోట్లు వస్తున్నాయని అధికారులు చెప్పారు. అయితే వీటిని మార్పిడికి చేయడానికి ఆర్‌బీఐతో సంప్రదింపులు చేయాలని కూడా టీటీడీ నిర్ణయించింది. బర్డ్‌ ఆస్పత్రిలో నూతన గదుల నిర్మాణానికి రూ.5.5కోట్లు, విశాఖలోని ఆలయానికి రహదారి కోసం రూ.4.5కోట్లు మంజూరు. గో సంరక్షణకు అధిక ప్రాధానం. ప్రతి ఆలయానికి ఒక ఆవు ఇవ్వాలని నిర్ణయాన్ని సమావేశంలో చర్చించారు. ఆవు ఇచ్చే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్‌ తెలిపారు.

Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.