Skip to main content

ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్ ప్రభాస్: బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ప్రశంసలు

 

బాహుబలి' తర్వాత మన దేశంలోని అగ్ర నటుల్లో ఒకరిగా ప్రభాస్ ఎదిగిపోయాడు. తాజాగా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో 'ఆదిపురుష్' చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ వైరల్ అయింది. ఈ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషించనున్నట్టు సమాచారం. మరోవైపు, ప్రభాస్ పై ఓంరౌత్ ప్రశంసలు కురిపించారు.


ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో ప్రభాస్ అని ఓంరౌత్ కితాబిచ్చారు. 'మోర్ దేన్ లైఫ్' సినిమాలను చేయగల హీరో అని ప్రశంసించారు. ఇదే సమయంలో 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ చెప్పారు. ఓవైపు మౌనమునిలా ఉంటూనే... గర్జించే పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని తెలిపారు. ఇప్పటి వరకు కనిపించని ఓ డిఫరెంట్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తాడని చెప్పారు. ఈ సినిమా కోసం విలువిద్యలో ప్రభాస్ శిక్షణ తీసుకోబోతున్నాడని వెల్లడించారు.  

Comments