సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ విషయంపై హీరోయిన్ అనష్క స్పందించింది. ప్రస్తుతం ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తాను కూడా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వల్ల వేధింపుల బారిన పడ్డానని పేర్కొంది. సినీ రంగంలో ఇటువంటి వేధింపులు ఎదురవుతాయన్న విషయం అందరికీ తెలిసిన అంశమేనని, ఇందులో దాయడానికి ఏమీ లేదని ఆమె చెప్పింది.
టాలీవుడ్‌లోనూ ఇది ఉందని ఆమె తెలిపింది. తాను ముక్కుసూటితనంతో వ్యవహరించడంతో పాటు ధైర్యంగా ఉండడంతో క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగానని ఆమె తెలిపింది. అందుకే తనతో ఎవరూ చెడుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది. అయితే, కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చే వారికి క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు తప్పవని తెలిపింది. తాను వేధింపులకు లొంగిపోకుండా సినీ పరిశ్రమలో నడుచుకునే దాన్నని చెప్పుకొచ్చింది.
Comments
Post a Comment