Skip to main content

ఎంత వద్దని చెబుతున్నా వినని హైదరాబాద్ ప్రజలు... తలపట్టుకుంటున్న ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ!



కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైరతాబాద్ గణనాధుడిని దర్శించుకునేందుకు భక్తులు రావద్దని, ఆన్ లైన్ లోనే పూజలు, దర్శనం చేసుకోవాలని గణేశ్ ikఉత్సవ కమిటీ ఎంతగా విజ్ఞప్తి చేసినా, భక్తులు వినలేదు. ప్రతియేటా పెట్టే 60 అగుడుల భారీ విగ్రహం స్థానంలో, ఈ సంవత్సరం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేసినా, తొలిరోజునే పెద్దఎత్తున ప్రజలు స్వామి దర్శనానికి వచ్చారు. ఒక్కరంటే ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించాలన్న ఆలోచన లేకుండా, సెల్ఫీలకు ఎగబడ్డారు. పలువురు కనీసం మాస్క్ లు కూడా ధరించక పోవడం గమనార్హం. వీరిని నియంత్రించలేక ఉత్సవ కమిటీ ఇబ్బందులు పడింది.

కాగా, ఈ సంవత్సరం ధన్వంతరి నారాయణ గణపతిగా, చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో స్వామి కనిపిస్తున్నారు. కరోనా కారణంగా నేరుగా దర్శనం లేదని, దూరం నుంచి స్వామిని చూసి వెళ్లిపోవాలని నిర్వాహకులు పదేపదే చెబుతున్నా, ఎవరూ వినే పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు.  

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...