Skip to main content

కరాచీలోనే దావూద్‌.. అంగీకరించిన పాక్‌‌! అండర్‌ వరల్డ్‌ డాన్‌పై ఆర్థికంగా ఆంక్షలు

 అండర్‌ వరల్డ్‌ డాన్‌పై ఆర్థికంగా ఆంక్షలు



మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, అధోజగత్తు నేత (అండర్‌ వరల్డ్‌ డాన్‌) దావూద్‌ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాక్‌ ఎట్టకేలకు అంగీకరించింది. దావూద్‌ తమ దేశంలో లేడని ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న ఆ దేశం ఈ విషయాన్ని ఎట్టకేలకు అంగీకరించింది. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) విధించిన గ్రే లిస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు తాజాగా 88 నిషేధిత ఉగ్ర సంస్థలు, అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో దావూద్‌ పేరు ఉండడంతో ఇన్నాళ్లు దాచిన నిజం బయటకొచ్చింది.

పారిస్‌లోని ఎఫ్‌ఏటీఎఫ్‌ పాక్‌ను 2018లో గ్రే లిస్ట్‌లో పెట్టింది. 2019 చివరి నాటికి ఉగ్రవాద సంస్థలు, వాటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో గడువును పొడిగించింది. ఈ క్రమంలో గ్రే లిస్ట్‌ ముప్పు నుంచి తప్పించుకునేందుకు తాజాగా ఆ దేశంలో ఈ నెల 18న రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. అందులో నిషేధిత ఉగ్రవాద సంస్థలు సహా, వాటి నేతల ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. వారి స్థిర, చరాస్తులను జప్తు‌ చేసి, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో దావూద్‌ ఇబ్రహీంతో పాటు జమాత్‌ ఉద్‌ దవా (జేయూడీ) చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌, జైషే మహ్మద్‌ (జేఈఎం) చీఫ్‌ మసూద్‌ అజహర్‌, జకీర్‌ రెహమాన్‌ లఖ్వీ పేర్లు ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ల ప్రకారం దావూద్‌ కరాచీలో తలదాచుకుంటున్నట్లు తేలింది. నోటిఫికేషన్‌లోని చిరునామా‌ను బట్టి ఈ విషయం స్పష్టమైంది. కరాచీలో ఉంటున్నాడని భారత్‌ మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకే పాకిస్థాన్ తాజా నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. గ్రే లిస్ట్​లో ఉంటే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సహా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం పొందడం పాకిస్థాన్‌కు కష్టమవుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...