కరోనా కారణంగా వాయిదా పడిన విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే నెల 5వ తేదీ నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నారు.
కరోనా కారణంగా వాయిదా పడిన విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే నెల 5వ తేదీ నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నారు. దానికి తగ్గట్టుగానే పాఠశాల విద్యాశాఖ అకడమిక్ కేలండర్‌ను కూడా సిద్ధం చేసింది. విద్యార్ధులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని నిర్ణయించారు. ఇక ఈ కొత్త అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2020-21లో 181 రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయి.
అటు సెలవులను కూడా తగ్గించింది. దసరా పండుగకు (అక్టోబర్ 22 నుంచి 26 వరకు) ఐదు రోజులు ఇవ్వనుండగా.. సంక్రాంతికి (వచ్చే ఏడాది జనవరి 12 నుంచి జనవరి 17 వరకు) ఆరు రోజులు ఇవ్వనున్నారు. ఇక క్రిస్మస్‌కు డిసెంబర్ 24 నుంచి 28 వరకు.. అలాగే వచ్చే ఏడాది వేసవి సెలవులు 2021, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఇచ్చారు. కాగా, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు మొత్తం 8 పీరియడ్స్ ఉండనుండగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇవి జరగనున్నాయి.
Comments
Post a Comment