కరోనా దెబ్బకు స్తంభించిపోయిన సినీ, టీవీ రంగాలకు ఊరటనిచ్చేలా కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. లాక్ డౌన్ అనంతరం షూటింగులు ప్రారంభమైనా కరోనా కేసులు వస్తుండడంతో అవి నిలిచిపోయాయి. తాజాగా అన్ లాక్-3లో భాగంగా కేంద్రం సినీ, టీవీ షూటింగులకు అనుమతి ఇచ్చింది. అయితే, అనేక నిబంధనలను విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ ప్రకటన చేశారు. కెమెరా ముందు ఉండే నటీనటులు తప్ప మిగతా వాళ్లందరూ మాస్కులు వేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు
Comments
Post a Comment