Skip to main content

రష్యా వ్యాక్సిన్‌పై భారత్‌ చర్చలు ఫేజ్‌-1, 2 సమాచారం కోరిన ఇండియన్‌ కంపెనీలు

 


కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి మొట్టమొదటి టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఇప్పటికే రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుని.. కీలకమైన మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెడుతోంది. దీంతో ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన కంపెనీలు కూడా ఫేజ్‌-1, ఫేజ్-2 క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారం కోరినట్లు ఆ దేశ మీడియా స్పుత్నిక్‌ పేర్కొంది. వ్యాక్సిన్‌ దేశీయ ఉత్పత్తికి, ఎగుమతికి కూడా అనుమతి కోరినట్లు  తెలిపింది. ఈ మేరకు రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌)తో చర్చించినట్లు పేర్కొంది. 

‘‘స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్‌-1, ఫేజ్‌-2 సాంకేతిక వివరాలను ఆర్‌డీఐఎఫ్‌ను భారత కంపెనీలు అడిగాయి. అన్ని అనుమతలూ పూర్తి చేసుకున్న అనంతరం దేశీయంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, ఎగుమతి చేసేందుకు అనుమతి కోరాయి’’ అని స్పుత్నిక్‌ వెల్లడించింది. మాస్కోలోని రాయబార కార్యాలయ వర్గాలు ఈ వివరాలు తెలిపినట్లు పేర్కొంది.

మరోవైపు మాస్కోలోని భారత రాయబారి వెంకటేశ్‌ వర్మ ‘స్పుత్నిక్‌-వి’పై ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రియేవ్‌తో చర్చించారు. కొవిడ్‌-19 పై వ్యాక్సిన్‌ ఉత్పత్తి విషయంలో పరస్పర సహకారం విషయంలో చర్చించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. చర్చలు ఫలప్రదంగా జరిగాయని, సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వెంకటేశ్‌ వర్మ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని దిమిత్రియేవ్‌ తెలిపారు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.