Skip to main content

65మంది సింగర్స్‌ 5 భాషలు.. ఒక పాట!

 


వీడియో చూడండి:https://youtu.be/vVrdWGNUy04

భారత స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. బానిస సంకెళ్లు తెంచుకున్న భారత్‌ సగర్వంగా నిలబడిన ఈ రోజును అత్యంత ఘనంగా జరుపుకోవాల్సి ఉండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ చేసుకోవాల్సి వస్తోంది. అయితే, దేశభక్తికి ఏ నిబంధనలు వర్తించవు. మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపించారు మన సినీ గాయకులు.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి చిత్రం  ‘రోజా’. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘వినరా.. వినరా.. దేశం మనదేరా’ పాటను 5 భాషల్లో 65మంది గాయకులు ఆలపించారు. ‘టుగెదర్‌ యాజ్‌ వన్‌’ పేరుతో తీర్చిదిద్దిన ఈ పాటను రామ్‌చరణ్‌ విడుదల చేశారు. ‘టుగెదర్‌ యాజ్‌ వన్‌’ ట్రాక్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇది మనలోని ఏకత్వాన్ని చూపిస్తోంది. ఒక ముఖ్యమైన కారణం కోసం 65మంది సింగర్లు కలిసి ఈ పాట పాడటం విశేషం’ అని ట్వీట్‌చేశారు.

తెలుగులో ఈ పాటకు రాజశ్రీ సాహిత్యం అందించగా, తమిళంలో వైరముత్తు, హిందీలో పీకే మిశ్రా, మలయాళంలో గోపాలకృష్ణన్‌లు రచించారు. 65మంది సింగర్స్‌ తమ ఇళ్లలోనే ఉండి పాడిన వీడియోలను ఒక్కటిగా కూర్చి తీర్చిదిద్దిన ఈ పాటను మీరూ చూసేయండి.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...