Skip to main content

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై స్పందించిన కుమారుడు చరణ్‌



కరోన తో పోరాడుతూ ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. శుక్రవారం ఆయన ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ తన తండ్రి అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆడియో సందేశాన్ని పంపారు.

‘‘అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్యం విషయంలో తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే అప్‌డేట్‌ ఇవ్వాలని అనుకున్నా. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న వెంటిలేటర్‌‌పై ఉంచడం ఆయనకు ఎంతో ఉపయోగపడింది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంపై వైద్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడి సాధారణ స్థితికి వచ్చేస్తారు. నాన్నగారి ఆరోగ్యంపై నేను అప్‌డేట్‌ ఇస్తాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని ఆడియో సందేశంలో పేర్కొన్నారు.

ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు సైతం బులిటెన్‌ విడుదల చేశాయి. ‘‘కరోనాతో బాధపడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. వైద్యుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

‘‘ఆగస్టు 5న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైంది. అయితే గురువారం రాత్రి ఆయన తిరిగి అస్వస్థతకు గురి కావడంతో వైద్య నిపుణుల సూచన మేరకు వెంటనే ఆయన్ని ఐసీయూకి తరలించాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు నిన్న వెల్లడించాయి. దీంతో అన్ని భాషల సినీ ప్రముఖులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థించారు.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here