Skip to main content

కరోనా భయాలు లేకుండా వినాయక చవితి జరుపుకోండి.. ఒక్క క్లిక్ తో వినాయకుడు, పూజ సామగ్రి, పత్రులు మీ చెంతకే!


 విఘ్నాలకు అధిపతి, అన్ని ఆటంకాలను నివారించే దైవం గణపతి. శివపార్వతుల ప్రథమ పుత్రుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనిని కూడా ప్రారంభించరు. వినాయకుడి అనుగ్రహం ఉంటే అన్నింటా విజయమే లభిస్తుందనేది హిందువుల నమ్మకం. భక్తుల ఇష్టదైవం గణనాయకుడి పుట్టినరోజైన వినాయకచవితి వచ్చేస్తోంది.  హిందువులంతా వినాయకచవితిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో వినాయకుడి బొమ్మను ప్రతిష్టించి... పువ్వులు, పత్రులతో భక్తితో పూజించి... ఆ తర్వాత నిమజ్జనం చేయడం ఆనవాయతీ. మరో వారం రోజుల్లో వినాయకచవితి ఉండటంతో... సర్వత్ర పండుగ హడావుడి మొదలైంది.


సాధారణంగా వినాయక చవితి వస్తోందంటే పెద్ద సందడి కనిపిస్తుంటుంది. కానీ, ఈ ఏడాది పరిస్థితులు కరోనా వైరస్ కారణంగా పూర్తిగా మారిపోయాయి. జనాలు ఎప్పటి మాదిరి స్వేచ్ఛగా మార్కెట్లోకి వెళ్లి కావాల్సినవి కొనుక్కొని వచ్చే పరిస్థితులు లేవు. మరోవైపు వినాయకుడి పూజకు కావాల్సిన అన్ని రకాల పత్రులను సేకరించడం కూడా అంత ఈజీ కాదు. అంతేకాదు పూజకు ఏయే పత్రులను వినియోగించాలో కూడా మనలో చాలా మందికి అవగాహన ఉండదు. రోడ్లపై రకరకాల ఆకులు అమ్ముతుంటారు. రెండో ఆలోచన లేకుండా అడగినంత సొమ్ము వారి చేతిలో పెట్టి, పిచ్చిపిచ్చి ఆకులు కూడా ఇంటికి తెచ్చుకుంటుంటాం.

ఈ కష్టాలన్నింటికీ చెక్ పెట్టేందుకు వచ్చింది 'ఆరాధ్య' ఆన్ లైన్ కంపెనీ. గత మూడేళ్లుగా భక్తులకు వీరు నాణ్యమైన సేవలను అందిస్తున్నారు. పూజకు అవసరమైన మట్టి వినాయకుడితో పాటు 18 రకాల పూజా సామగ్రి, 21 రకాల పత్రులను ఓ ప్యాక్ ద్వారా అందజేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ వాసులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నారు.

భక్తులకు రెండు రకాల కిట్లను ఆరాధ్య అందిస్తోంది. 12 ఇంచుల మట్టి వినాయకుడు సంపూర్ణ కిట్ తో కలిపి ధర రూ. 1,200. మినీ పూజ కిట్ తో కలిపి 8 ఇంచుల వినాయకుడి ధర రూ. 600.

పూజా కిట్ పొందాలనుకునే వారు
https://aaradhyakit.com/

వెబ్ సైట్లోకి లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు. లేదా 9494563839, 9849610015 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆరాధ్య కంపెనీ అన్ని సురక్షితమైన జాగ్రత్తలు పాటిస్తూ కిట్లను భక్తులకు అందిస్తోంది. భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా వినాయక చవితిని జరుపుకోవడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆరాధ్య యాజమాన్యం తెలిపింది.

గణేశ్ కిట్లను బుక్ చేసుకున్న వారు కింద పేర్కొన్న పికప్ పాయింట్ల నుంచి కిట్లను తీసుకోవచ్చు. పికప్ పాయింట్ల వివరాలు ఇవే.

హైదరాబాద్:
  • జూబ్లీహిల్స్ - టీ3, ఫ్లోర్ 3, గ్రీన్ వ్యూ ప్లాజా, రోడ్ నంబర్ 1 & 68. 
  • మణికొండ - మారుతి ఎంక్లేవ్, పోచమ్మ కాలనీ, నవ్య ప్రైడ్ ఎదురుగా. 
  • గుడిమల్కాపూర్ - సత్య శోభ అపార్ట్ మెంట్, శారదానగర్ కాలనీ. 
  • కొండాపూర్ - గ్రీన్ టెర్రేసెస్ అపార్ట్ మెంట్, వైట్ ఫీల్డ్స్. 
  • అమీర్ పేట్ - శ్రీ వాసవి ప్రింటర్స్, ఫస్ట్ ఫ్లోర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా. 
  • కూకట్ పల్లి - రోడ్ నంబర్ 24, వివేకానందనగర్ కాలనీ. 
  • నిజాంపేట్ - ప్లాట్ నంబర్ 29 & 30, షాప్ నంబర్ 2, సాయిరత్న, శ్రీనివాసనగర్ కాలనీ. 
  • చందానగర్ - స్టేషన్ రోడ్. 
  • సికింద్రాబాద్ - రైల్ నిలయం దగ్గర. 
  • నాచారం - కాంక్రీట్ ఓపస్ అపార్ట్ మెంట్స్, రిలయన్స్ డిజిటల్ వెనుక, రవీంద్ర నగర్. 
  • ఈసీఐఎల్ - 5వ క్రాస్ రోడ్, ఏపీహెచ్బీ కాలనీ, కుషాయిగూడ. 
  • కొత్తపేట్ - విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్
  • రామంతపూర్ - గుప్తా గార్డెన్స్ దగ్గర. 
  • సుచిత్ర - సుచిత్ర క్రాస్ రోడ్స్ దగ్గర. 
  • నల్లగండ్ల - అపర్ణ సరోవర్ దగ్గర. 
  • ఆర్టీసీ క్రాస్ రోడ్ - ఆర్టీసీ కల్యాణ మంటపం దగ్గర. 
విజయవాడ:
  • వన్ టౌన్ - డోర్ నంబర్ 11-34-7, కుటుంబరావ్ స్ట్రీట్, అరవింద మెడికల్స్ పక్కన, సమరంగ్ చౌక్ దగ్గర. 
  • బందర్ రోడ్ - ది ఫార్మా జనరిక్ హౌస్, విజయకృష్ణ సూపర్ బజార్, గవర్నర్ పేట్. 
  • గాంధీనగర్ - 26-4/1-6, కృష్ణమూర్తి స్ట్రీట్, గాంధీ నగర్, జింఖానా క్లబ్ దగ్గర. 
భక్తులకు వినాయకుడి కిట్ ను అందించాలనే ఆలోచన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మదిలో మొలకెత్తింది. పూజా సామగ్రి కోసం, పత్రి కోసం భక్తులు పడుతున్న ఇబ్బందే, ఆయనను ఈ దిశగా అడుగులు వేసేలా చేసింది. చివరకు 'ఆరాధ్య' పేరుతో సంస్థను ప్రారంభించి... భక్తులకు అవసరమైన అన్నింటినీ ఒకే కిట్ ద్వారా అందించేందుకు ప్రేరేపించింది. వినాయకుడి తోపాటు, ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఈకో ఫ్రెండ్లీ అయివుండటం గమనార్హం.

Comments